సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో ఇటీవల పెను సంచలనం.. ప్రముఖ పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఊరించి ఊరించి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సమక్షంలోచేరటం. ఆ నేపథ్యంలో ఖమ్మం లో ఏర్పాటు చేసిన సభకు పొంగులేటి ఫై అభిమానంతో లక్షలాది మంది ప్రజలు తరలి రావడం .. ఖమ్మం జిల్లాలో 10 సీట్లు లో కాంగ్రెస్ ను గెలిపిస్తానని ప్రకటించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నూతన ఉత్తేజం వచ్చేసింది. అయితే గతంలో పొంగులేటి .. ఖమ్మం లో సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కు మద్దతుగా తెలంగాణ విడిపోయినప్పటికీ అధినేత జగన్ మద్దతుతో వైసిపి తరపున పోటీ చేసి చత్రుర్ముఖ పోటీలో లక్ష కు పైగా ఓట్ల తో గెలవడమే కాదు ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనుడు.. పొంగులేటి .. వై యస్ కుటుంబానికి ఇటు సీఎం జగన్ కు ఇప్పటికి బాగా సన్నిహితుడు అన్న విషయం అందరికి తెలిసిందే.. అయన గతంలో వైసిపి ని వదలి సీఎం కెసిఆర్ కు మద్దతు తెలిపిన.. బిఆర్ ఎస్ నుండి బయటకు వచ్చిన కూడా సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కూడామొదటి సారిగా నేడు, గురువారం తాడేపల్లి లోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకు పొంగులేటి వచ్చి సీఎం జగన్‌తో అరగంటకుపైగా మర్యాదపూరకముగా .. ? పలు విషయాలు మాట్లాడారని వచ్చిన వార్తలు అటు తెలంగాణాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎలాగైతే రేవంత్ రెడ్డి ఇప్పటికి చంద్రబాబు కు సన్నిహితుడో.. పొంగులేటి కూడా జగన్ కు అంతే మరి.. ఇక జగన్ సోదరి వై యస్ షర్మిల కూడా కాంగ్రెస్ గూటిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుండి ఇద్దరు రాజ్యసభ సభ్యులను వైసిపి కోటాలో సిద్ధం చేసిన వై యస్ జగన్ రాజకీయ ప్యూహం ఎవరికీ అంతు బట్టడం లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లో వైసిపి, టీడీపీ పార్టీల బ్రీడ్ లు కలసి తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *