సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఆసరా పెన్షన్ల‘ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు భీమవరం కలెక్టరేట్ కు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు హాజరు అయ్యారు. ఆనంతరం రేపు ముఖ్య మంత్రి గారి భీమవరం పర్యటన సంద్భంగా బైపాస్ రోడ్డు లోని శ్రీ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో భారీగా సీఎం జగన్ ఫ్లెక్సీలు, వైసిపి జెండాలతో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని మరియు లూథరన్ హైస్కూల్ లోని హెలిప్యాడ్ ను అక్కడి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ , పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, ప్రభుత్వ విఫ్ , భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు MLC కవురు శ్రీనివాస్ ఉండి వైసిపి పార్టీ ఇంచార్జి పి వీ ఎల్ నరసింహరాజు తదితర నేతలు మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తమ క్యాడర్ ఆధ్వర్యంలో అధికారులు సహకారంతో జరిగిన ఏర్పాట్లు ను వారికీ వివరించడం జరిగింది.ఈ సమావేశానికి సుమారు 25 వేలకు పైగా ప్రజలు, విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ సుమారు 600 పైగా బస్సులు పార్కింగ్ చేసేందుకు ప్రదేశాన్ని సిద్ధం చేసారు.
.
