సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ డిసెంబర్ 8వ తేదీన భీమవరం పట్టణంలో బహిరంగ సభలో విద్యదివేన ఈ విడుత నిధులు విడుదల చెయ్యడానికి వస్తున్నా నేపథ్యంలో భీమవరంలో ఆయన పర్యటన ను విజయవంతం చెయ్యాలని, విశేషంగా తరలివచ్చే అభిమానులకు, విద్యార్థులకువారి తల్లులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ ఇప్పటికే వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశ్యం చేసారు. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా నేడు, గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మరియు జిల్లా ఎస్పీ రవికుమార్, ఇతర ప్రభుత్వ అధికారులతో కలసి సీఎం జగన్ హెలి కాఫ్టర్ దిగే లూధరన్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసే హెలిపాడ్ ప్రాంతాన్ని మరియు సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించే గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనుక సభా స్థల ప్రాంగణంన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరిశీలించారు. సీఎం జగన్ పట్టణంలో పలు ప్రారంబోత్సవాలలో పాల్గొనే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రతిష్ఠమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
