సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో నిన్న, నేడు, బుధవారం రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి జగన్‌ గత మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకుని అక్కడ గ్రామా దేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. తదుపరి అలిపిరిలో ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన 50 ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు. 2వ విడతగా మరో 50 బస్సులు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇకపై డీజిల్ వినియోగ లేకపోవడంతో పకృతి కి మేలుతో పాటు భక్తులు బస్సు వాసన వికారాలు సమస్యలకు దూరంగా ఉండవచ్చు. . అక్కడ నుంచీ నేరుగా తిరుమల కొండపైకి వెళ్లి రాత్రి 8 గంటలకు బేడీ ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడ నుంచీ శ్రీవారి ఆలయానికి వెళ్ళి, సంప్రదాయం ప్రకారం పట్టు ధోవతి ధరించి, తిరునామం పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి తలపై పెట్టుకొని పట్టువస్త్రాలు శ్రీవారికి సమర్పించారు. . తర్వాత రాత్రి మాడ వీధుల్లో పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. తదుపరి రాత్రికి కొండపైనే బస చేసి మరుసటి రోజైన నేటి, బుధవారం వేకువ జామున 6.05 గంటలకు మరోసారి శ్రీవారిని మరోసారి దర్శించుకొన్నారు. తదుపరి నేటి ఉదయం7 గంటలకు నిత్యాన్నప్రసాద భవనం పక్కనే 22 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన పరకామణి భవనాన్ని, ప్రారంభించారు. ( ఫై తాజా చిత్రంలో ఆ ఫోటో చూడవచ్చు) తదుపరి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి బాలాజీనగర్‌ సమీపంలో నిర్మించిన లక్ష్మీ వి.పి.ఆర్‌ రెస్ట్‌ హౌస్‌ను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *