సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి, వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా భీమవరం పట్టణంలో వాడవాడలా వైసిపి క్యాడర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ విఫ్ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ముఖ్య ఆహ్వానితునిగా స్థానిక వైసిపి నేతలు ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసిపి పార్టీ రంగులతో అందంగా తయారుచేసిన భారీ కేక్ కట్ చేసి అందరికి మిఠాయిలు పంపిణి చేసారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనుక్షణం ప్రజా శ్రేయస్సు ను కాంక్షింస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో అందరికి ఆపన్న హస్తం అందిస్తున్న సీఎం జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిలాల్లలని..మరల మరల అధికారంలోకి రావాలని ప్రజలు అందరు కోరుకొంటున్నారని అన్నారు. తదుపరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వచ్చంధంగా రక్తదానం చేస్తున్న దాతలను అభినందించారు.
