సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో విజయవాడ శివారులలో బస్సు ఫై నుండి ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు బంతి పువ్వులు విసురుతూ వాటి మధ్య ఆయనపై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో బలంగా రాయి తాకడంతో క్కడ నుదురు చిట్లి గాయమైంది. దీంతో వెంటనే వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. అక్కడ కంటి చుట్టూ వాపు వచ్చింది. సీఎం జగన్ ప్రక్కన ఉన్న ఎమ్మెల్యే ఎల్లంపల్లి శ్రీనివాస్ కి కూడా మరో రాయితో కంటి దగ్గర గాయం అయ్యింది. కొద్దీ సేపు చికిత్స అనంతరం జగన్ బస్సు బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.పోలీసులు సీసీ టివిల ఫుటేజ్ ఆధారంగా ఆగంతుకులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు.
