సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, నిర్మలాదేవి పంక్షన్ హాలులో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేతల సభలో గత బుధవారం రాత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అమ్మవడి వేదికపై సీఎం జగన్ తనను ఊగిపోతూ మాట్లాడతాడు అన్న వ్యాఖ్యలను తప్పుబట్టి జగన్ వాహభావాలు తాను నటించి చూపించి .. ఇలా మాట్లాడాలా? అంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగనకు ‘అ’ నుంచి ‘అం అః’ వరకు ఒత్తులూ రావు.. దీర్ఘాలూ రావు… వరాహికి, వారాహికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు, ఒక నియంత, ఒక కంటకుడు, తెలుగు అక్షరాలు రాని వ్యక్తి పాలనలో అంతా బాధపడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగురకూడదు. అదే నా బలమైన కోరిక. గోదావరి జిల్లాల అభివృద్ధికి మాస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్లానను 30వ తేదీన( రేపు సాయంత్రం డా అంబెడ్కర్ సెంటర్లో) భీమవరం సభలో ప్రకటిస్తా. ఇక్కడే ఎక్కువగా మాట్లాడగలను.. అయిన శుక్రవారం ఇక్కడే బహిరంగ సభలో మొత్తం మాట్లాడాలి. అప్పటిలోగా వైసీపీ వాళ్లు ఆగలేక అనేక తప్పులు కచ్చితంగా చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *