సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత సీఎం జగన్ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని నేడు, శనివారం రిలీజ్ చేశారు. నవరత్నాలు ప్లస్ పేరుతో సీఎం జగన్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తున్నానని తెలిపారు. తమ నవరత్నాలు పథకాల ద్వారా 58 నెలల్లో, రూ.2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీ రూపంలో లబ్దిదారులకు ఇచ్చామన్నారు, కరోనా రెండేళ్లపాటూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఆదాయం పడిపోయేలా చేసినా, మేనిఫెస్టో అమలు మాత్రం కచ్చితంగా చేశామన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే.. మా వైసీపీ పాలనలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇక మ్యానిపెస్టో లో కొత్తగా ఆవిష్కరించిన అంశాలు పరిశీలిస్తే.. వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు… వైఎస్సార్ కాపునేస్తం నాలుగు దఫాల్లో 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు…. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో రూ.45 వేల నుంచి రూ. లక్ష 5 వేలకు పెంపు… అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు… వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల వరకు రుణాలు… అర్హులై ఇళ్లస్థలాలు లేనివారికి ఇళ్ల స్థలాలు అందజేత…వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు.. వృద్దులకు నెలవారీ పెంక్షన్ మరో రెండు విడతల్లో పెన్షన్ రూ.3500కు పెంచనున్నామని ప్రకటించారు.
