సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా కాపు ఉద్యమాలు చేసిన కాపు అగ్ర నేత ముద్రగడ పద్మనాభం నేడు, శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో పలువురు కీలక కాపు నేతలతో కలసి వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఐదేళ్లుగా అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. గతంలో ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెస్, టీడీపీ బీజేపీలలో పనిచేసారు. అయితే ఆయన కాపు ఉద్యమ నాయకుడుగా, ఆమరణ నిరాహార దీక్షలతో ప్రబల శక్తిగా ఎదిగినప్పటికీ ఎన్నికల బరిలో దిగినప్పుడు మాత్రం, మిగతా కులాలు దూరంగా పెట్టడంతో వల్ల ఆయన గతంలో ఓడిపోవడం గమనార్హం..
