సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపు శుక్రవారం ఉదయం ముఖ్య మంత్రి జగన్ పర్యటన అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టణం అంతటా నేతలు ఏర్పాటు చేసిన వైసిపి జెండాలతో సీఎం కు స్వాగత ద్వారాలతో శోభాయమానంగా ఉంది. లూథరన్ హైస్కూల్ నుండి తాలూకా ఆపీస్ రోడ్డు మీదుగా ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మరియు తాడేపల్లి గూడెం రోడ్డు, బై పాస్ రోడ్డు లలో ఎక్కడ చుసిన పోలీసులే.. దూసుకొనిపోతున్న పోలీస్ వాహనాలు.. సీఎం జగన్ పర్యటించే ప్రాంతాలు3 కిలోమీటర్లు మేర రోడ్డులు పోలీసులు నిఘాలోకి వెళ్లిపోయాయి. అసలే పండుగల సీజన్ దూరప్రాంతాల నుండి వస్త్రాలు, సరుకులు, జ్యులయలరి కొనుగోళ్ల కోసం వచ్చే జిల్లా వాసుల తో రోడ్డులు రద్దీ గా ఉండి ట్రాఫిక్ జాం అవుతుంది. మరో ప్రక్క పోలీస్ నిఘా.. టీపీ గూడెం వైపు రహదారి కిరువైపులా ఐరన్ బారికెట్స్ రోడ్డుకు ఇరువైపులా కిలో మీటర్ మేర ఒక్క రాత్రిలో అధికారులు ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోనే ఆధునిక రైల్వే టర్నల్ ను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు. ఆ రోడ్డుకు ఉన్న గుంతలు కూడా గ్రావెల్ తో పూడ్చేసారు. బై పాస్ రోడ్డు లో బివి రాజు జంక్షన్ వద్ద సుమారు 50 మంది పోలీసులు మోహరించడంతో అక్కడ ఈ సాయంత్రం నుండి వాహనాలు తరుచు జాం కావడం జరిగింది. కీలకమైన బైపాస్ రోడ్డు లోని శ్రీ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో భారీగా సీఎం జగన్ ఫ్లెక్సీలు, వైసిపి జెండాలతో ఏర్పాటు ల మధ్య సభా ప్రాంగణాన్ని పార్కింగ్ ప్రాంతాలను అణువణువు మెటల్ డిక్టేటర్స్ తో తనికీలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *