సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్తగా (పోగ్రామ్స్ కన్వీనర్) పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) నియమితులయ్యారు. ఆయనకు సహాయ మంత్రి హోదా కూడా లభించింది. ఉండి నియోజకవర్గానికి చెందిన పాందువ్వ శ్రీను దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మర్యాదస్తుడుగా గుర్తింపు పొందారు. దానికి గుర్తింపు గానే గతంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో ఆయనకు సన్ని హిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్తగా పదవి రావడంతో దీనితో ఆయనకు మంచి సన్నిహితులు ఉన్న భీమవరం తో పాటు స్వగ్రామం ఉండి మండలం పాందువ్వలో సందడి నెలకొంది..టీడీపీ వర్గాలు భీమవరం తో పాటు ఆయన స్వ గ్రామంలో స్వీట్లు పంచి పెట్టారు.
