సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: రామ్ గోపాల్ వర్మ క్రైం సినిమాలకు ఏమాత్రం తీసిపోని సజీవ ఘటనలు యూపీలో వరుసగా జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యానాద్ కఠిన వైఖరి నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాంగేస్టర్ లు, మాఫియా, రౌడీ షీటర్స్ వందలాదిగా పోలీస్ ఎన్కౌంటర్స్ లో వరుసగా హతం అవుతున్న నేపథ్యంలో.. గత రాత్రి ప్రయాగ్రాజ్ లో మీడియా సాక్షిగా కీలక రాజకీయా ప్రముఖులు, కిడ్నప్,హత్య లలో వందలాది కేసులు ఉన్న 5సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (60), అతడి సోదరుడు, ఎమ్మెల్యే అష్రాఫ్లను గుర్తుతెలియని వ్య క్తులు శనివారం రాత్రి 10 గంటల సమయం లో కాల్చి చంపారు. ఒక మెడికల్ కళాశాల వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నా యి. అతీక్ అహ్మ ద్ , సోదరుడు ఆప్రాన్ లను వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్న లడుగుతున్న సమయంలోనే మీడియా గుంపులో వచ్చి న ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్చారు .కింద పడ్డాకా కూడా వారిద్దరిపై కసిగా కాల్పులు కొనసాగాయి. ఈ దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. కాల్పుల ఘటనకు కారకులుగా భావిస్తూ ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. హతుడు మాజీ ఎంపీ అతీక్ ఫై దాదాపు 100 క్రిమినల్ కేసులున్నాయి. అతడి 19 ఏళ్ళ కుమారుడు అసద్ ను గత గురువారం జరిగిన ఎన్కౌం టర్లో కాల్చి చంపడం గమనార్హం. అంతకు మించిన స్థాయిలో ఒక్క రోజు తేడాతో తండ్రి, బాబాయ్ హతం కావడం ఊహించని ట్విస్ట్.. ఫై చిత్రంలో ఇద్దరు మరణించడానికి కొద్దీ సెకన్ల ముందు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *