సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మెన్, కొయ్యే మోషేనురాజు తన కార్యాలయంలో ఒక బాలుడు ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో సీఎం సహాయనిధి క్రింద రూ 5.20 లక్షల చెక్కును అందజేశారు. విషయంలోకి వెళితే.. భీమవరం పట్టణ సరిహద్దు గ్రామం విస్సాకోడేరుకి చెందిన ముత్యర్ల యేసురాజు కుమారుడైన చరీష్ కుమార్ అనే ఆరేళ్ళ బాలుడికి మాటలురావు, వినబడదు. ఎన్నో ఇబ్బందులు పడి హైదరాబాద్ రైన్ బో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. కుటుంబ దీనపరిస్థితి తెలుసుకున్న మండలి చైర్మన్ మోషేనురాజు స్పందించారు. సీఎం జగన్ దృష్టికి తీసుకొనివెళ్ళి ఫలితం సాధించారు. దానితో ఆ బాలుడి వైద్య సహాయం నిమిత్తం సి ఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ 5.20 లక్షల చెక్కును నేడు, శుక్రవారం భీమవరంలోని తన కార్యాలయంలో మండలి చైర్మన్ మోషేనురాజు, ఉండి నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ పి వి ఎల్ నర్సింహారాజుచేతుల మీదుగా చరీష్ కుమార్ కు తండ్రి యేసురాజు, తాత రామకృష్ణ సమక్షంలో అందజేశారు.ఈ సందర్బంగా చరీష్ కుమార్ తాత రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్, మండలి చైర్మన్ మోషేనురాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *