సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఏపీలోని విశాఖ ఉక్కు కర్మా గారం నిర్వహణకు మూలధనం కోసం నిబంధనల మేరకు ఉక్కు ఉత్ప త్తులను కొనేందుకు .. రాష్ట్రీయ ఇస్పా త్ నిగం లిమిటెడ్ గతనెల 27వ తేదీన ప్రైవేట్, ఇతర స్టీల్ అనుబంధ రంగాల కంపెనీలు లేదా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. అయితే అయితే కెసిఆర్ ప్యూహాలు చాల వేగంగా ఉంటాయని నిరూపించే ఘటన జరిగింది. ఎవరు ఊహించని రీతిలో సీఎం కెసిఆర్ ఆదేశాలమేరకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇం ట్రెస్ట్-ఈవోఐ ప్రతిపాదనల బిడ్డిం గ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది. ఇందులోభాగంగా సింగరేణి తరఫున లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ పాల్గొనడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్య తిరేకంగా తమ వైఖరిని వెల్లడించడం తో పాటు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడం ,( BRSపార్టీ కి ఏపీ రాజకీయాలలో కీలక స్తానం కోసం కూడా..) తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కు ను సమకూర్చుకోవడం లక్ష్యాలతో సీఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం వెంటనే వైజాగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్న తాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశిం చారు. ఒకటి, రెం డు రోజుల్లో అధికారుల బృందం విశాఖకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *