సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు, ఆర్థిక వ్యవహారాలు చూసేవాడిగా భావిస్తున్న కిలారు రాజేష్ స్కిల్ కనపడటం లేదని విదేశాలకు వెళ్లిపోయాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఆయన నేడు, సోమవారం స్కిల్ స్కాం కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. తాజగా తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో రాజేష్ పిటిషన్ వేశారు. అయితే స్కిల్ కేసులో రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని కోర్టుకు సీఐడీ ప్యూహాత్మకంగా తెలిపింది. అవసరమైతే ఆయనకు సీఆర్పీసీలోని 41 A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పింది. ఈ రోజు హజరుకావల్సిందిగా రాజేష్‌కు సీఐడీ 3 రోజులు క్రితం నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణ కు హాజరు కావడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *