సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి ఇన్నర్ రిం గ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ సీఐడీ విచారణ నేడు, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. సీఐడీ అధికారులు ప్రశ్నలకు లోకేష్ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని అతని అరెస్ట్ తప్పదని మీడియాలో వార్తలు పదే పదే ప్రసారమయ్యాయి. అయితే విచారణ అనంతరం బయటకు వచ్చి న లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యా. అయితే, ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్న లు అడిగారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు. సీఐడీ అధికారులు నన్ను 50 ప్రశ్నలు అడిగారు. నేను, నా కుటుంబసభ్యులు ఇప్పటివరకు వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఎలా లాభపడ్డారో ? ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇది కక్షసాధిం పు తప్ప ఎలాం టి ఆధారాలు లేని కేసు. ఈ ప్రభుత్వం దొంగ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోంది. చివరకు రేపు బుధవారం మరోసారి విచారణకు రావాలని చెబుతూ అక్కడే నాకు 41 ఏ నోటీసులు ఇచ్చారు. ఈరోజు వచ్చిన విధం గానే బుధవారం కూడా విచారణకు హాజరవుతా’’ అని లోకేశ్ తెలిపారు. ఇక నేడు…ఢిల్లీలో సుప్రీం కోర్టులో చంద్రబాబు అరెస్ట్ ఫై వేసిన క్వాష్ పిటిషన్ ఫై విచారణ శుక్రవారం కు వాయిదా పడింది.
