సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అచ్చమైన తెలుగు కుటుంబాల కథలతో తెలుగువారి బంధాలు అనుబంధాలు సూటిగా సుతిమెత్తగా చెప్పిన సినిమాలు ఏవంటే.. సీతారామయ్య గారి మనవరాలు.. మరొకటి మనలో ‘పెద్దోడు- చిన్నోడు’ బ్రాండ్ తో రేలంగి మామయ్య మంచితనంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇవి సినిమాలు కాదు .. తెలుగు వారి సాంప్రదాయక ఆస్తులు.. వారసత్వ కళ సంపద.. ఆ సినిమాలలో ప్రతి మాట మన తెలుగు బాషా యాస, కాస్త వెటకారంతో కూడిన వినోదం, మాటలు సంభాషణలు గుండె లోతులను తడుముతాయి. 3 గంటల సినిమాలతో ప్రేక్షకులను ప్రశాంతంగా సేదతీరుస్తాయి. ఇటీవల అగ్ర హీరోల సినిమాల రీ రిలీజ్‌ల‌ను కూడా సూప‌ర్ హిట్లు చేస్తుంటాం.అయితే మరి వెంకటేష్, మహేష్ బాబు లు అన్నాతమ్ములుగా నటిస్తూ, జీవిస్తూ.. ఇద్దరు అగ్రహీరోల కలయికతో 14 ఏళ్ళ క్రితం వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ మరోసారి రి రిలీజ్ తో తెలుగునాట థియేటర్స్ లో నిన్నటి నుండి సందడి చేస్తుంది. టీవీలో వంద‌ల సార్లు ప్ర‌ద‌ర్శిత‌మైన సినిమా ఇది. హెచ్ డీ క్వాలిటీ ఓటిటి లో అందుబాటులో వుంది. నిన్న శుక్రవారం రీ రిలీజ్ లో ఊపు మామూలుగా లేదు. అన్ని కేంద్రాలలో హౌస్ ఫుల్ షోలే .. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 3 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ కలెక్షన్ వసూళ్లు సాధించి అందరి మతులు పొగట్టింది. భీమవరం పద్మాలయా కాంప్లెక్స్ లో సైతం 2 థియేటర్స్ లో వేసిన 8 ఆటలు హౌస్ ఫుల్ అయ్యి 2 లక్షల 38 వేల కలెక్షన్ సాధించింది. మరో 3 రోజులు ఈ కలెక్షన్స్ వీరవిహారం కొనసాగే అవకాశం కనపడుతూనే. ప్రస్తుతం వెంకీ మామ క్రేజ్ మాములుగా లేదు. సూపర్ స్టార్ మ‌హేష్‌ని వెండి తెర‌పై చూసుకొని యేడాది దాటేసింది. అందుకే ఫ్యాన్స్ కూడా భారీగా ఎగ‌బ‌డ్డారు.దిల్ రాజు ఖజానా మరోసారి కోట్ల రూపాయలుతో నిండిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *