సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రామచంద్రునిగా నటిసున్న 400 కోట్ల రూ బడ్జెట్ తో నిర్మిస్తున్న 3డీ యానిమేషన్ సినిమా ‘ఆదిపురుష్’. తాజాగా నేడు, శ్రీరామ నవమి పండుగ సందర్భముగా ఈ సినిమా నుంచి సీత లక్ష్మణ, హనుమంతు సమేత శ్రీరాముని గెటప్ లో మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. . ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్స్ తయారు చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అన్నిటినీ కలిపి మేకర్స్ ఓ వీడియోగా తయారు చేసి వదిలారు.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్, రామాయణం ఆధారంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటించారు. సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *