సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రాజధాని నిర్మాణం ఫై నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్ చర్చ వేదిక KSR లైవ్ షో లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ” అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని ‘ అన్నవ్యాఖ్యలు ఉచ్చరించినప్పుడు కార్యక్రమ హోస్టుగా నివారించలేదని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఛానల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ రావును నేడు, సోమవారం (Journalist Kommineni ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. ఆయనపై కూడా పోలీసులు పలు సెక్షన్ ల క్రింద కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ రావు, జర్నలిస్టు కృష్ణంరాజుపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు కూడా పోలీసులకు పిర్యాదు చేసి కేసు నమోదు చేసారు.
