సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం మళ్ళి పెళ్లి ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకనాటి హీరో, సీనియర్ నటుడు నరేష్ నిర్మాతగా హీరోగా తన నిజ జీవిత ఘటనలతో ప్రముఖ నిర్మాత, ఎం ఎస్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. ఇక సినిమా కధ విషయానికి వస్తే .. అందరికి తెలిసిందే.. నిజ జీవితంలో నరేష్ , పవిత్రల మీద చాలా వార్తలు వచ్చాయి. అలాగే నరేష్ పెళ్లిళ్ల మీద ఎన్నో వివాదాలు కూడా వార్తల్లో వచ్చాయి. ముఖ్యంగా మూడో భార్య రమ్య రఘుపతి, నరేష్ మధ్యలో నడిచిన ఆరోపణలు, ఒకరి మీద ఒకరు చేసుకొన్నా అభియోగాలు అప్పట్లో డైలీ సీరియల్ తరహాలో టివి ఛానెల్స్ లో చూసేసారు. అలాగే నరేష్, పవిత్రతో సహజీవనంలో ఉండటానికి కారణం పాజిటివ్ గా చూపించారు. ఆమె మొదటి భర్త తో ఎందుకు విడిపోయింది. ఆమె జీవితంలో ఉన్న విషాదగాధ తో పాటు .. నరేష్ తన ఆలోచన కోణంలో 3వ భార్య పెట్టిన టార్చర్ హైలైట్ గా.. ఆమెను విలన్ గా చూపెడుతూ .. నరేష్ పవిత్రాల బంధంనికి తల్లి విజయ నిర్మల మద్దతు ఉన్నట్లు సినిమా తీశారు. ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకొంటుంది ?అని కాకుండా తమ జీవితం ఫై వచ్చిన కాంట్రవర్సీ ని తానే క్యాష్ చేసుకోవాలనే నరేష్ విచిత్ర ఆలోచన ఎంతమందికి నచ్చుతుందో .. కానీ అందరు చక్కగా నటించారు. తక్కువ సన్నివేశాలు ఉన్నపటికీ శరత్ బాబు సూపర్ స్టార్ కృష్ణ పోలిన గెటప్ లో దాదాపు అలాగే ఉన్నారు.తల్లి విజయ నిర్మల ను పోలిన పాత్రలో జయసుధ హుందా గా కనపడ్డారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు అన్నీ నరేష్ జీవితంలో జరిగిన సంఘటనలను పోలి ఉండటం ఆసక్తికరం. నరేష్ 3వ భార్య గా నటించిన వనితా విజయ్ కూడా అందరికన్నా హైలైట్ గా శాడిస్ట్ భార్యగా జీవించారు. సురేష్ సంగీతం బాగుంది. పని గట్టుకొని కాకపోయినా ఎలాగూ.. ఓటిటి లో వచ్చాక ‘మళ్ళి పెళ్లి’ చూసేవచ్చు..
