సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగులో కూడా పలు చిత్రాలు నటించిన ప్రముఖ తమిళ సీనియర్ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించారు. ఈ నటుడు గత కొంతకాలంగా కిడ్నీలోకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. గత మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 21న) తీవ్రంగా అనారోగ్యం పాలవ్వడంతో ఆయన్ని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రభు ఆరోగ్యం గురించి వివరిస్తూ మేడ్వే యాజమాన్యం ఓ నోట్‌ని విడుదల చేసింది. అందులో.. నటుడికి కిడ్ని లో రాళ్లు ఉండగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ప్రభు ఆర్యోగం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
