సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నలుగురు సీనియర్ అగ్రహీరోలతో నాగార్జున వెనుకబడినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇప్పటికి యువ హీరోలతో పోటీ పడుతూ భారీ హిట్స్ తో 10 కోట్ల పైగా పారితోషకంతో ముందుకు దూసుకొనివెళుతున్నారు. వీరిలో వెంకీ మామ మినిమమ్ గ్యారెంటీ హీరో.. నిజానికి వీరిలో చిరంజీవి దశాబ్దంగా అటు అల్లు ప్రొడక్షన్ తో పాటు రాంచరణ్ సొంత బ్యానర్ కొణిదల లో ఒక మోస్తరు hit సినిమాలకే పరిమితం అయ్యారు. ఇటీవల సూపర్ హిట్.. వాల్తేర్ వీరయ్య మైత్రి వారి సినిమా .. అందువల్ల ఆయన రెమ్యూనేషన్ ?చర్చ అవసరం లేదు. అయితే ఇటీవల నందమూరి బాలకృష్ణ ఈమధ్య అఖండ, వీర సింహ రెడ్డి, ఆన్ స్టాపబుల్ షో తో సహా వరస విజయాలు సాధిస్తున్నారు. మామూలుగా అయితే బాలకృష్ణ పారితోషికం గురించి పెద్ద పట్టింపు ఉండదని ఇండస్ట్రీ టాక్.. ఎందుకంటే నిర్మాతల పరిస్థితి బట్టి తన పారితోషికం తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు బాలయ్య రేంజ్ మాములుగా లేదు. ఆయనతో సినిమాలకు 7 గురు అగ్ర నిర్మాతలు పోటీపడుతున్నారని టాక్.. .ఇప్పుడు బాలకృష్ణ తన కెరీర్ లో అత్యధికంగా పారితోషికాన్ని 20 కోట్లకు చేసినట్టు ఇండస్ట్రీ టాక్.. దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమాకి ఇదే పారితోషికాన్ని తీసుకుంటున్నాడు అని కూడా అంటున్నారు. బాలకృష్ణ సినిమాలు కూడా 75 కోట్ల వరకు ధియేటరికల్ వ్యాపారం చేస్తున్నాయి, అదీ కాకుండా అతని సినిమాలు ఓ.టి.టి, టీవీ చానెల్స్ లో మంచి డిమాండ్ వుంది మరి..
