సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎల్ హెచ్ భీమవరం టౌన్ హాల్ 86వ వార్షికోత్సవ సర్వ సభ్య సమావేశాన్ని ఆదివారం గొల్లవాని తిప్ప రోడ్డులోని టౌన్ హాల్ నూతన స్థలంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఎంతో సామర్థ్యంతో కూడుకున్నవి క్లబ్ లని, పది మందికి ఉపయోగపడే విధంగా క్లబ్ లుండాలని అన్నారు. క్లబ్ లలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలను నిరంతరం నిర్వహించాలన్నారు. 50 ఏళ్ల నుంచి ఎంతో మంది ఈ టౌన్ హాల్ లో టెన్నిస్ ఆడుతున్నారని, ఎంతో మంది ఈ టౌన్ హాల్ అభివృద్ధికి సహకరించారని, బ్రిటిష్ కాలం నుంచి ఈ టౌన్ హాల్ ఉందన్నారు. సమాజానికి మేలు చేసిన వారిని గుర్తించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ నూతన ఆలోచనలతో టౌన్ హాల్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. అనంతరం సీనియర్ టెన్నిస్ ఆటగాళ్లకు మెమంటోస్ ను అందించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, గౌరవాధ్యక్షులు మెంటే పార్ధసారధి, గవర శేషారావు, అదనపు కార్యదర్శి గ్రంధి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *