సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఈ ప్రాంతంలో ప్రముఖులను ప్రజా ప్రతినిధులను రాజకీయాలకు అతీతంగా ప్రజలు కలసి శుభాభినందనలు తెలపడం ఒక సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ విషయంలో ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు (RRR) గత 5 ఏళ్లుగా నూతన సంవత్సర వేడుకలలో స్థానిక భీమవరం, ఉండి ప్రజలు శుభాబినందలు అందుకోలేకపోయారు. ఎన్నో కేసులు వేధింపులు నేపథ్యంలో గతంలో ఎంపీ అయినప్పటికీ నియోజకవర్గానికి రాష్ట్రానికి దూరంగా ఉండవలసి వచ్చిన నేపథ్యం. అయితే మరల 2024లో కాలం కలసి వచ్చింది. మరోసారి స్థానిక ఉండి ఎమ్మెల్యే గా త్రిముఖ పోటీలో సైతం అఖండ మెజారిటీ తో గెలుపొందారు. మరి దానికి బోనస్ గా ‘రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి’ పదవి గౌరవం కూడా ఆయనను వరించింది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పెదమిరం లోని ఆయన నివాసం లో 5 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై సహనంగా నిలబడి భారీ క్యూ లైన్ లలో ఎండలో నిలబడి వస్తున్నా పార్టీలకు అతీతంగా తన అభిమానుల నుండి కూటమి నేతల నుండి స్థానిక భీమవరం ఉండి నియోజకవర్గాల ప్రజలు నుండి అభినందలు పుష్ప గుచ్చాలు ఆలా అందుకొంటూనే ఓపికగా రఘురామా గత 5 ఏళ్లుగా తాను కోల్పోయిన ఆనంద క్షణాలు ఆస్వాదించారు. నేడు రఘురామా నివాసం ఉన్న ప్రాంతమంతా వందలాది కారులు బైకులతో సంక్రాంతి కోడి పందాల తరహా సందడిని ముందే చూపించేసింది అంటే నమ్మండి.
