సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజక వర్గంలో పలు చోట్ల కోర్ట్ అనుమతులతో ప్రభుత్వ భూముల, రోడ్ల ఆక్రమణలు, డ్రైన్స్ కు అడ్డంకులు తొలగిస్తున్న నేపథ్యంలో నిన్న స్థానిక నిర్వాసితులకు, (ఆక్రమణ దారులకు?) మద్దతుగా, రఘురామా కృష్ణంరాజు కస్టడీ టార్చర్ కేసులో విచారణ ఎదురుకొంటున్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫొటో ఉన్న కారుతో కొందరు ఆకివీడులో స్థానికులను రెచ్చగొడుతున్నారని సమాచారం రావడంతో… ఆకివీడు పోలీసులు సునీల్ కుమార్ అంబేద్కర్ ఫొటోలతో ఉన్న కారులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. వారు వచ్చిన కారు గుత్తికొండ జోగిరావు పేరుమీద ఉన్న ఇన్నోవా కారు అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై నేడు, గురువారం ఉండి ఎమ్మెల్యే , డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నేడు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆకివీడులో నిన్న (బుధవారం) సాయంత్రం ఇన్నోవా కారులో సునీల్ కుమార్ ఫోటో, పోలీసు అని స్టిక్కర్ వేసుకుని కొంత మంది వ్యక్తులు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గొడవ చేశారని అన్నారు. గుత్తికొండ వెంకట జోగారావు పేరు మీద ఆ కారు ఉందని.. సునీల్ కుమార్ అనుచరులుగా వాళ్ళు వచ్చినట్టు తాను భావిస్తున్నానని, తన నియోజకవర్గంలో ఇంత విచ్చల విడిగా రౌడీయిజం చేయడానికి వారు వస్తే పోలీసులు వారిపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు..జోగారావుపై చర్యలు తీసుకోవాలన్నారు. అంబేద్కర్ మిషన్‌కు తనకు సంబంధం లేదని సునీల్ కుమార్ చెప్పగలడా? అని ప్రశ్నించారు. నిన్న జరిగిన సంఘటనకు సునీల్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *