సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో తనను చిత్ర హింసలు పెట్టిన … ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ(DOPT) కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నేడు, సోమవారం లేఖ రాశారు. ఈనేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను రాసిన పిర్యాదు లేఖ నేపథ్యంలో.. ఇటీవల సునీల్ కుమార్ రాజకీయంగా కులాలను రెచ్చగొట్టే విధంగాచేసిన వివాదాస్వాద వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లానని వారి నిర్ణయం,తీసుకొనే చర్యలు కోసం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదేనని పీవీ సునీల్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను డీవోపీటీ దృష్టికి తీసుకొనివెళ్ళానని ,అన్నారు. సునీల్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. సునీల్ కుమార్ సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ఆయనకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఎలా వర్తిస్తాయని: ప్రశ్నించారు.వీటిని వెంటనే డీవోపీటీ పరిశీలించాల సునీల్ కుమార్‌ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని రఘురామ కృష్ణమరాజు డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ దగ్గర ఎంత డబ్బు ఉందొ ఉందొ? తనకు తెలియదు కానీ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయ పార్టీ పెట్టి అయన ఆశయాలుతో ఎన్నికలలో పోటీ చేసి సీఎం అయ్యి నిరూపించుకొంటే నేను కూడా సంతోషిస్తానని రఘురామా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *