సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా(హ్యాం డిల్)లో చేసిన పోస్టింగ్స్ ఫై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ‘తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. . జగన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మీకుమొట్టికాట్టి యలు వేస్తూ తీర్పు ఇస్తే.. సిగ్గూ లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా? మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తిచూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందంటూదుష్ప్ర చారం చేస్తారా?’మనిషి అన్నాక కొద్దిగా నైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
