సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. గత చం ద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగాయి అని భావిస్తున్న అవకతవకలపై దర్యా ప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థ కు సుప్రీం కోర్ట్ అడ్డంకులు తొలగించింది. లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ.. ప్రాధమిక దర్యాప్తు దశలో హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని సిట్ దర్యాప్తు కు అనుమతించింది. సిట్ దర్యాప్తు లో గత చంద్రబాబు హయాంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమం లో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సుప్రీం కోర్ట్ తాజా తీర్పు ఫై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డి హర్షం వ్యక్తం చేసారు. దేశంలో అతిపెద్ద భూ కుంభకోణం అమరావతి భూముల కుంభకోణం అని, స్కిల్స్ దేవలెప్మెంట్ వందల కోట్ల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర సుస్వష్టం అని , ఇక సిట్ దర్యాప్తు ప్రారంభం అయ్యాక చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూడవచ్చనని కీలక వ్యాఖ్యలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *