సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చుసిన … స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేడు, మంగళవారం సుప్రీం కోర్ట్ లో నిరాశ ఎదురయింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టు ద్వి సభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ప్రకటించింది.ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వా ష్ పిటిషన్ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. చంద్రబాబు కు స్కిల్ స్కాం కేసులో రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.మొదట తీర్పు లో 17-ఏ వర్తిం పుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వ గా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా .త్రివేది తీర్పు ప్రకటించారు. జస్టిస్ త్రివేది తీర్పు ఇస్తూ.. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్ప డిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్య సాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫెర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజేఐ ముందుకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *