సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డూ కల్తీ వివాదం ఫై సుప్రీం కోర్ట్ విచారణ లో సీఎం చంద్రబాబు నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. లడ్డు కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు లేవు అని సుప్రీం కోర్ట్ అబిప్రాయపడటంతో రాష్ట్రంలో వైసీపీ నేతలతో పాటు కేంద్రంలో అనేక హిందూ సంస్థలు, బీజేపీ నేతలు సైతం హర్షం ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు, మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 3వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కాగా.. గత సోమవారం లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి తరపు లాయర్లు వాదించారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఇప్పిటికే కోర్ట్ కోరింది. గురువారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
