సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు నేడు, గురువారం ఉండి నియోజకవర్గంలోని పెదపుల్లేరు గ్రామంలో రూ. 76.50 లక్షల “జల్ జీవన్ మెషిన్” నిధులతో “పి.డబ్ల్యూ.ఎస్. స్కీం అభివృద్ధి & ప్రతి ఇంటికి కుళాయి” పథకం క్రింద ఏర్పాటు చేసిన “40KL ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్, 1 MLD మైక్రో ఫిల్టర్, 2,400 మీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్, 91 పైప్ కనెక్షన్లు” ను ప్రారంభించారు. తదుపరి “మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం” క్రింద రూ. 10.00 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. తదుపరి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు తన స్వగ్రామం అయి భీమవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. . ఈ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు వారి డబ్బు 24 గంటలలో వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ స్థానిక నాయకులు, పలువురు ప్రభుత్వ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.
