సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భారతీయ సినీ అద్భుతం..తెలుగువారి కుటుంబాలతో అనుబంధం పెనవెసుకొన్న సూపర్స్టార్ కృష్ణ దివికేగిన క్షణాలు ఇంకా అభిమానులలోనే కాదు ప్రతిఇంటా ఎదో రూపేణా చర్చకు వస్తున్నాయి. ఎన్టీఆర్ తరువాత అంతటి కాలానికి చెదరని క్రేజ్ అయన సొంతం మరి.. నేడు ఆదివారం (నవంబర్ 27) హైదరాబాద్ లో సూపర్ స్టార్, స్వర్గీయ కృష్ణ పెద్ద కార్యం నేపథ్యంలో హైదరాబాద్ లో 2 ప్రాంతాలలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అభిమానులకు జేఆర్సీ కన్వెన్షన్ .. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఎన్ కన్వె న్షన్ లో ( నాగార్జునకు చెందినది. నాకు అత్యంత ఇష్టుడు కృష్ణ గారిని ఆలా నిర్జీవంగా చూడలేను అంటూ నాగార్జున వివరణ ఇవ్వడం గమనార్హం.) భోజన ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల అభిమానుల కోసం 5వేల పాసులను పంపిణీ చేశారు. కృష్ణ సహజంగా మంచి మాంసాహార బోజనప్రియుడు కావడంతో 32 రకాల వంటకాలతో ప్రముఖులకు ఎన్ కన్వెన్షన్ లో విందు ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులంతా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగాఅభిమానులు తరలివస్తున్నారు.
