సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 350 పైగా చిత్రాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో ఇప్పటికి అమరజీవిగానే నిలిచిపోయారు. మరి ఆయన అభిమానులకు శుభవార్త! హీరో కృష్ణ గతంలో నటించి రిలీజ్ కాకుండా ఆగిపోయిన ‘ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం’ సినిమా జనవరి 3వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా దశాబ్దం క్రిందట రూపొందిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో యశ్వంత్–సుహాసిని జంటగా నటించగా.. నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, దర్శకనిర్మాత లు పాల్గొన్నారు.
