సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా షూటింగ్ మొదలయింది. అయితే ఇందులో కథానాయికగా పూజ హెగ్డే పేరును మాత్రమే ప్రకటించారు. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీయాలని, అందుకోసం మలయాళం, తమిళ్, హిందీ నుండి నటులను తీసుకోవాలని చూస్తున్నారు. అనిల్ కపూర్ ను నటింప చెయ్యాలని భావించిన అది సాద్యం కాలేదని తెలుస్తుంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర సమాచారం ప్రకారం ఇందులో సీనియర్ హీరో, విలక్షణ నటుడు, మోహన్ బాబు నటిస్తున్నారని, వార్త హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడం తో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుందని అందుకే తమకు పూర్తీ అందుబాటులో ఉండే ఆర్టిస్టులతో సినిమా పూర్తీ చెయ్యాలని నిర్మాత చిన్నబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాలలో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా మోహన్ బాబు గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ లో యమధర్మ రాజుగా అదరగొట్టారు.మోహన్ బాబు కీలక పాత్రలో సూర్య హీరోగా హిట్ అయిన తమిళ, తెలుగు సినిమా ఆకాశమే హద్దు కూడా సంచలనమే.. మరి , మహేష్ బాబు సినిమాకు ఏవిధంగా ప్లస్ అవుతాడో చూడాలి.. ఈ వార్త నిర్మాతలు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు ఫిల్మ్ వర్గాలు..
