సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ అత్యుత్తమ న్యాయస్థానం సూప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న బీఆర్ గవాయ్ నవంబర్ 23వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.
