సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంబటి రాంబాబు ఫై కర్రల తో చేసిన దాడి మరియు ఆయన ఇంటిపై టీడీపీ నేతలు చేసిన దాడి , తదుపరి అంబటి సీఎం చంద్రబాబు ను ఆగ్రహంతో బూతులు తిట్టాడని పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన ఘటనలు ఇంకా మీడియా ఛానెల్స్ లో వైరల్ అవుతుండగానే .. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకునిరసనగానే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.మంత్రి లోకేశ్‌కు చిప్‌ దెబ్బతింది. బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారు. తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కల్తీ అంటూ చేసిన ప్రచారాన్ని సిబిఐ సిట్‌ నిగ్గు తేల్చింది.ఇంకా టీడీపీ వాళ్లు బొక్కుతున్నారు. ’’ అంటూ జోగి రమేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ వర్గాలు బొగ్గుమన్నాయి. గత ఆదివారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ..ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వ్యక్తులు రమేష్ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *