సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం పురపాలక సంఘ కార్యాలయం లో కేంద్ర సఫారీ కర్మ చారి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా NAMSTE కార్యక్రమము నిర్వహించారు. భీమవరం పురపాలక సంఘం పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులలో పాల్గొనే వారిని గుర్తించి వారిని ఈ ప్రోగ్రాం ద్వారా వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేసి వారిలో అర్హులకు ఈరోజు పురపాలక సంఘ కమిషనర్ మరియు అసిస్టెంట్ కమీషనర్ వార్ల చేతుల మీదుగా PPE కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమీషనర్ కే రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ఈ వ్యవస్థలో పనిచేసే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది అన్నారు. ప్రస్తుతం మునిసిపల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లుగా ఎవరైనా అర్హులు ఉంటే వారు వివరాలను నమోదు చేసుకుని భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా వచ్చే సబ్సిడీలు పొందే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపు నిచ్చారు..
