సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో వచ్చేనెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు. వీటిలో విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు వివరాలు:
మచిలీపట్నం-విజయవాడ (07896)
విజయవాడ-మచిలీపట్నం (07769),
నర్సాపూర్-విజయవాడ (07863),
విజయవాడ-మచిలీపట్నం (07866),
మచిలీపట్నం-విజయవాడ (07770),
విజయవాడ-భీమవరం జంక్షన్ (07283),
మచిలీపట్నం-విజయవాడ (07870),
విజయవాడ-నర్సాపూర్ (07861)
గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన రైళ్ల వివరాలు: సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా (22643) సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో భావ్ నగర్ – కాకినాడపోర్ట్ (12756)సెప్టెంబరు 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు – గౌహతి (12509) రైళ్లను దారి మళ్లించారు.
