సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే నెల 9న ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల నుండి సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులు నేరుగా గాని లాయర్ ద్వారా కానీ ఈ లోక్ అదాలత్ పాల్గొని తమ కేసుల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి కోరారు. స్థానిక ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాధికార సంస్థ భవన్ లో వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె బీమా కంపెనీల అధికారులు, ఏపీఎస్ఆర్టీసీ, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో, పిటిషనరు న్యాయవాదులు, బీమా కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్ తో కేసుల పరిష్కా రం నిమిత్తం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది గత జూలై 22న నిర్వహించిన స్పెషల్ లోక్అదాలత్ లో ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా వ్యాప్తంగా 130 వాహన ప్రమాద పరిహార కేసులు రాజీ చేశామన్నారు.
