సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆర్ సిఎం చర్చ్ ప్రాంగణంలో ఐపీఏఎఫ్ఎఫ్ సి దైవజనుల ఐక్య క్రిస్మస్ ఆహ్వాన వేడుకల్లో నేడు, శనివారం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు క్రిస్మస్‌ అంటే సంతోషకమైన పండుగ, ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, క్రిస్మస్‌ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని అంజిబాబు అన్నారు ఏసుప్రభువు ప్రపంచానికి అందించారని ప్రేమ భావాన్ని, సేవతత్పరతను, క్షమాగుణాన్ని బోధించారని, క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజని అన్నారు. సోదర, సోదరీమణులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలని, జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *