సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిట్’ సిరీస్ సినిమాలతో హిట్స్ కొట్టిన శైలేష్ కొలను దర్శకత్వం లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ‘సైంధవ్’.. టీజర్ తాజగా రిలీజ్ అయ్యి పూర్తీ యాక్షన్ సినిమా గా ప్రమోషన్ చేసుకొంటుంది. చాల కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ హీరోగా తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి లెక్క మారుతుందంటూ ‘సైంధవ్ టీజర్ లో హెచ్చరిస్తున్నాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రం వెంకటేష్ తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. సంక్రాంతి బరిలో చిన్నోడు ‘గుంటూరు కారం’ తో పెద్దోడు పోటీ షురూ చేసుకొన్నాడు మరి..
