సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్ సినిమాలతో దుమ్ములేపేసే దమ్మున్న సీనియర్ హీరో వెంకటేష్. చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. హిట్ సిరీస్ హిట్స్ అందించిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సినిమాల పోటీ బరిలో జనవరి 13న పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ బాషలలో రిలీజ్ కానుంది. తాజగా నేడు, బుధవారం వదిలిన ట్రైలర్ లో ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘సైంధవ్ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. సలార్’ తరహా కధ కు మంచి ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసినట్లు కనపడుతుంది. ముఖేష్ రిషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య , ఆండ్రియాలు నటిస్తున్న ఈ సినిమాలో వెంకీ మామా వైఫ్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు 100 మందిని చంపేసి ఉంటాడు. అది కూడా ఎలా పడితే అలా… ఏది దొరికితే దానితో చంపేశాడు. లైన్ గా చూస్తే కమల్ విక్రమ్ సినిమాకి సైంధవ్ సినిమాకి కాస్త దగ్గర పోలికలు కనపడుతున్నాయి..ఇప్పటికైతే ఈ సినిమాపై మంచి రిపోర్ట్ ఉంది..మరి రిలీజ్ అయ్యాక సినిమా జాతకం డిసైడ్ చేద్దాం..
