సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి ఆదిపురుష్, దేవర సినిమాలతో సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో ఎదో అనుమాన స్వధా అంశం కనపడుతుంది. ఆయన ప్రస్తుతం 6 కత్తి పోట్ల గాయాలు నుండి తేరుకొంటున్నారు. ఒక దొంగను పట్టుకొనే క్రమంలో అతను సైఫ్ ను గాయపరిచాడని సీసీ కెమెరాలలో దొంగ ముఖం చూడవచ్చునని మీడియా చేనెల్స్ లో జరిగిన ప్రసారాలను పోలీసులు కొట్టివేశారు. తాజాగా ముంబై పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటి వరకు ఏ నిందితుడిని అరెస్ట్ చెయ్యలేదు. ఇప్పటికే పలు మీడియా ఛానల్స్ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు చేశాయి అయితే.. ట్విస్ట్ ఏంటంటే బాంద్రా పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ మీద దాడితో సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని స్వష్టం చేసారు.. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అసలు అక్కడ ఏమి జరిగింది? ఎవరు సైఫ్ ను పొడిచారు. దొంగ కథ నిజమేనా?
