సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్థానిక డీఎస్పీకార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులపై సమీక్షించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయని, సైబర్ నేరాల బాధితులు మోసపోయామని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే ఫలితం ఉంటుందని, మోసం జరిగిన మూడు గంటల్లోపు తమకు సమాచారం పిర్యాదు చేస్తే సొమ్ము మొత్తం రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. బాధితులు ఫిర్యా దు చేసేందుకు ఆలస్యం చేయడంతో ఇబ్బం దులు వస్తున్నాయని అన్నారు. బాధితులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యా దు చేయాలని, ప్రజలకు సూచించారు. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలు సాగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని చెప్పా రు. అలాగే పేకాట క్లబ్క్ల లు పూర్తిగార్తి మూసివేశామని, ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు: ఇటీవల క్రైమ్ రేట్ కాస్త పెరిగిందని, త్వరలో పోలీసు శాఖలో 6 వేల పోస్టుల భర్తీతోర్తీ సిబ్బం ది కొరత తీరుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నయీం అస్మీ, ఏఎస్పీ వి.భీమారావు, నరసాపురం డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *