సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టెక్నాలజీ పెరిగింది. దానిలో హ్యాకింగ్ పేరుతొ వక్రమార్గాలు లో డబ్బు సంపాదించేవారి సంఖ్య పెరిగింది. 2023లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో సైబర్ మోసానికి సంబంధించిన 17000 ఫిర్యాదులు అందాయి. వాటిలో 69 కోట్ల రూపాయల విలువైన సైబర్ మోసం జరిగింది. 2024లో ఆరు నెలల్లో 11 వేల సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందగా, అందులో రూ.62 కోట్ల మోసం సహా అనేక కేసులు ఉన్నాయి. అయితే ఈ మోసం జరిగిన తర్వాత కేవలం 10 శాతం డబ్బు మాత్రమే తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కవర్‌లను సాచెట్‌ల(Sachet) పేరుతో అందిస్తున్నాయి. వీటి కోసం HDFC ERGO రోజుకు కేవలం 3 రూపాయల ఖర్చుతో లభించే ఈ బీమా కవర్లు అందుబాటులో తెచ్చింది. . వీటిని తీసుకోవడం ద్వారా సైబర్ దోపిడీ, ఆన్‌లైన్ దోపిడీల నుంచి ఆయా వ్యక్తులు లేదా వ్యాపారాలను రక్షించుకోవచ్చు. ఆయా సైబర్ దాడులకు కవరేజ్ అందించబడుతుందని మాల్వేర్, ransomware సైబర్ దాడులకు వ్యతిరేకంగా వ్యాపారాలు, వ్యక్తులను రక్షించడమే సైబర్ సాచెట్ ఇన్సూరెన్స్ పాలసీ లక్ష్యమని HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పార్థనిల్ ఘోష్ అన్నారు.
