సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు ఆయన సోదరి షర్మిలకు అష్టి వివాదాలు రేకెత్తించిన పల్నాడు జిల్లాలోని వేమవరం, చెన్నాయపాలెం లలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల ను నేడు, మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ సందర్శించారు. అక్కడ జగన్ కు ఇండస్ట్రీ కోసం భూములు అమ్మిన సంబంధించిన కొందరు రైతులను కలిశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ తీసుకు వచ్చారని గుర్తు చేశారు.ఈ ప్రాంతంలో 400 ఎకరాల అటవీ భూములుంటే.. వాటిని రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని ఆరోపించారు. . 2009లో ఈ భూములను 30 ఏళ్లకు లీజుకు తీసుకుని.. మళ్లీ వాటిని 50 ఏళ్లకు పెంచారని అన్నారు. . తాము పరిశ్రమ ఏర్పాటు చేసి.. అందులో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఈ భూములు విక్రయించేలా నాటి పెద్దలు ఒప్పించారని వారికీ . ఇష్టం లేకున్నా.. ఈ భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకు వచ్చారని ఆరోపించారు. ఆ క్రమంలో అపట్లో పెట్రోల్ బాంబులు వేసి వారిని భయపెట్టారని అన్నారు. అలాగే 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. అలా రైతుల భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా జగన్ షర్మిల కుటుంబంలో కొట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ ఎద్దేవా చేసారు.
