సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ గుజరాత్‌లో మూడ్రోజుల పర్యటనలో భాగంగా నేడు, ఆదివారం ప్రఖ్యాత పురాణ ప్రాశస్యం, చారిత్రక ప్రాశస్యం ఉన్న సోమనాథ్ ఆలయాన్ని(Somnath Temple) ఆయన సందర్శించి సోమనాదునికి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి, త్రిసూలం, తలపాగా ధరించి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గత చరిత్ర లోనే కాదు.. స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఆ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఐక్యంగా, బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేకసార్లు దండయాత్రలు చేశారని, ఆలయ విధ్వంసానికి పాల్పడ్డారని, దోచుకున్నారనీ, అయినప్పటికీ ఈ ఆలయం ధైర్యం, త్యాగాలు, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.. వెయ్యి ఏళ్ళ తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని గర్వముగా ప్రకటించారు, . భారతదేశ విశ్వాసానికి స్వాభిమాన్ పర్వ్ ప్రతిబింబమని, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఒక గొప్ప జ్ఞాపకమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *