సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం ముగిసింది. భీమవరం గునుపూడిలో సాక్షాతూ చంద్ర ప్రతిష్టగా పురాణాలూ పేర్కొన్న.. పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానంనకు కార్తీకమాసం సందర్భముగా గత 35 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలు ను హుండీలు తెరచి నేడు, బుధవారం లెక్కించగా రూ.19,64,352/-లు ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు. ఇక గత 28 రోజులకు గాను భక్తుల పూజా రుసుముల ద్వారా రూ.5,98,224/-లు, రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.15,36,050/-లు, రూ.100/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.16,05,500/-లు, రూ.200/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.11,46,900/-లు, ఉచిత ప్రసాదముల వలన రూ.15,000/-లు, 31,370 లడ్డులు విక్రయించుట వలన రూ.4,70,550/-లు, హుండీల వలన రూ.19,64,352/- వెరశి మొత్తం కలిపి ఆధాయం 73 లక్షల 36వేల 576/- రూపాయలు వచ్చింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులైన కుర్మదాసు సత్యశ్రీనివాస్, నాచుశ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, కోయతాతాజీ, నల్లం రఘుబాబు,చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ పర్యవేక్షించగా వివిధ శాఖల సిబ్బంది పాల్గొని కార్తీక మాసోత్సవములను జయప్రదం గా నిర్వహించారు.
