సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం 26వ రోజు ఆఖరి ఆదివారం కావడంతో ఎంతో దూరప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. సుమారుగా శ్రీ స్వామివారి దర్శనార్థం 15 వేల మంది భక్తులు విచ్చేయగా దర్శనం టికెట్స్ ద్వారా రూ- 3, 12,550/- మరియు లడ్డు ప్రసాదం విక్రయం వలన సుమారు రూ 40 వేల రూపాయలు ఆదాయం వచ్చింది. వేలాది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. శ్రీ స్వామివారి నిత్యాన్నదానం ట్రస్ట్ నందు కానుకల ద్వారా రూ- 1,86,178/- రూపాయలు ఆదాయం లభించిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి డీ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
