సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో నేడు, ఆదివారం ఉదయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంలోని సోమారామం ‘శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి’ వారి ఆలయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణ రాజు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చే వేలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా,వారికీ ‘స్వామి’ కనపడేలా ఆయన కుటుంబ సభ్యులు దేవాలయంలో స్వామి ఎదురుగా క్రింద కొద్దీ సేపు కూర్చుని ప్రత్యక అబిషేకంలో పాల్గొని స్వామివారి అస్సిసులు తీసుకొన్నారు. దేవాలయ ఇఒ డి రామకృష్ణంరాజు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మెన్ బంగార్రాజు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వామి దేవేరుల దర్శనం చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *